BRS: బీఆర్ఎస్‌కు బై.. కాంగ్రెస్ గూటికి డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి

DCCB Chairman Manohar Reddy Quits BRS
  • టికెట్ ఆశించి భంగపడిన నేతల జంపింగ్‌లు
  • బీఆర్ఎస్‌కు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ రాజీనామా
  • తాండూరు టికెట్ ఆఫర్ చేసిన కాంగ్రెస్!
ఎన్నికలకు ముందు తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడిన వారు ఇప్పటికే పలువురు పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ జాబితాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి చేరారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డితో ఇప్పటికే భేటీ అయిన ఆయన తాజాగా పార్టీని వీడారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.

ఇవాళ ఉదయం 9 గంటలకు మనోహర్‌రెడ్డి నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ భేటీ జరిగింది. దీనికి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ హాజరైనట్టు తెలిసింది. కాగా, కాంగ్రెస్‌లో చేరుతున్న మనోహర్‌రెడ్డికి తాండూరు అసెంబ్లీ టికెట్ ఆఫర్ చేసినట్టు సమాచారం.
BRS
Telangana
Congress
DCCB Chariman Manohar Reddy

More Telugu News