170వ సినిమా కోసం రంగంలోకి దిగిన రజనీ .. ఇక దీనిపైనే ఫ్యాన్స్ దృష్టి!
- సెట్స్ పైకి వెళ్లిన రజనీ 170వ సినిమా
- మరోసారి ఖాకీ డ్రెస్ లో కనిపించనున్న రజనీ
- ముఖ్యమైన పాత్రలలో అమితాబ్ ... రానా .. ఫహాద్ ఫాజిల్
- సంగీతాన్ని అందిస్తున్న అనిరుధ్
- వచ్చే ఏడాది మధ్యలో ప్రేక్షకుల ముందుకు
త్రివేండ్రంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించగా, రజనీతో పాటు మంజువారియర్ కూడా హాజరయ్యారు. 'జైలర్' తరువాత పెద్దగా గ్యాప్ లేకుండానే రజనీ ఈ సినిమాతో రంగంలోకి దిగిపోవడం విశేషం. ఈ సినిమాలో ఆయన .. బూటకపు ఎన్ కౌంటర్ పై దర్యాప్తు చేసే పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని అంటున్నారు.
ఈ సినిమాలో అమితాబ్ కీలకమైన పాత్రను పోషించనున్నారు. ఇది 32 ఏళ్ల తరువాత అమితాబ్ - రజనీ కలిసి నటిస్తున్న సినిమా కావడం విశేషం. ఇతర ముఖ్యమైన పాత్రలలో రానా .. ఫాహద్ ఫాజిల్ .. మంజువారియర్ .. దూషరా విజయన్ కనిపించనున్నారు. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.