Talasani: చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

  • చంద్రబాబు అరెస్ట్ తనను వ్యక్తిగతంగా బాధించిందన్న తలసాని
  • చంద్రబాబు ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పారని వ్యాఖ్య
  • టీడీపీ అధినేత పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరమన్న మంత్రి
  • 73 ఏళ్ల వయస్సులో అరెస్ట్, విచారణ పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదన్న తలసాని
Talasani responds on chandrababu arrest

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. బుధవారం ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మాజీ సీఎం అరెస్ట్ బాధాకరమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తాను మంత్రిగా పని చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన అక్రమ అరెస్ట్ తనను వ్యక్తిగతంగా ఎంతగానో బాధించిందన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. చంద్రబాబు ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పారన్నారు.

టీడీపీ అధినేత పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న తీరు విచారకరమన్నారు. దాదాపు 73 ఏళ్ల వయస్సు ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేయడం దారుణమన్నారు. విచారణ పేరుతోనూ ఆయనను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఎంతగానో కృషి చేశారన్నారు.

More Telugu News