Jagan: జగన్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్ మార్పు.. రేపే హస్తినకు పయనం

  • రేపు ఉదయమే ఢిల్లీకి వెళ్తున్న జగన్
  • మోదీ, అమిత్ షాలను కలవనున్న సీఎం
  • చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ప్రస్తావనకు వచ్చే అవకాశం
Jagan going to Delhi tomorrow

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో మార్పు చోటుచేసుకుంది. ఈ నెల 6న ఆయన ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా... షెడ్యూల్ ను మార్పు చేశారు. రేపు ఉదయం 10 గంటలకు ఆయన హస్తినకు బయల్దేరుతున్నారు. జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కాకినాడ జిల్లా సామర్లకోటలో రేపు జరగాల్సిన జగనన్న ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని ఉన్నట్టుండి వాయిదా వేశారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో జగన్ భేటీ కానున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.

More Telugu News