అధిష్ఠానం నుంచి అత్యవసర పిలుపు.. హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన కిషన్ రెడ్డి
- కేంద్ర కేబినెట్ సమావేశాల్లో తెలంగాణ అంశాలకు ప్రాధాన్యత
- అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ ఫోకస్
- అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం కానున్న కిషన్ రెడ్డి
ఇదిలావుంచితే, నిన్న ఇందూరు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రధాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించాయి. కేసీఆర్ ఢిల్లీకి వచ్చి తనను కలిశారని, ఎన్టీయేలో చేరుతామని, కేటీఆర్ కు రాష్ట్రంలో పాలన పగ్గాలు అందించాలనుకుంటున్నానని, కేటీఆర్ ను ఆశీర్వదించాలని తనను కేసీఆర్ కోరారని మోదీ చెప్పారు. అయితే ఇది రాచరికం కాదని, బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోబోమని ఆరోజే కేసీఆర్ కు స్పష్టం చేశామని తెలిపారు. ఎన్టీయేలో బీఆర్ఎస్ చేరేందుకు తాను అంగీకరించలేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.