ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎలక్ట్రిక్ ట్రాలీ బస్సులో ప్రయాణించిన నితిన్ గడ్కరీ... ఫొటోలు ఇవిగో!
- చెక్ రిపబ్లిక్ దేశంలో నితిన్ గడ్కరీ పర్యటన
- ప్రేగ్ నగరంలో ఎలక్ట్రిక్ ట్రాలీ బస్ టెస్ట్ రైడ్
- మెరుగైన రవాణా ప్రత్యామ్నాయాలుగా ఈ బస్సులను అభివర్ణించిన గడ్కరీ
- ఖర్చు తక్కువ అని వెల్లడి
ఈ బస్సు పొడవు 24 మీటర్లు. చెక్ రిపబ్లిక్ ఆటోమొబైల్ దిగ్గజం స్కొడా ఈ ఎలక్ట్రిక్ ట్రాలీ బస్సును అభివృద్ధి చేసింది.
ప్రస్తుతం ఈ బస్సు ప్రయోగాత్మక దశలో ఉందని గడ్కరీ తెలిపారు. ఒక్కసారి ఇది రోడ్డెక్కితే, మెట్రో నగరాల్లో రవాణా ఎంతో చవకగా మారుతుందని వివరించారు. మెట్రో రైళ్ల మాదిరిగా ఈ బస్సులకు ప్రత్యేక ట్రాక్ లైన్లు ఉంటాయని, ఇవి నగరాల్లో తక్కువ ఖర్చుతో మెరుగైన రవాణా ప్రత్యామ్నాయాలుగా మారతాయని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఇలాంటి బస్సులతో ప్రజా రవాణా మౌలిక సదుపాయాలను మరింత విస్తరించవచ్చని తెలిపారు.


