Hyderabad: పెయింటర్‌తో పెళ్లి ఏర్పాట్లు.. ఎంబీఏ యువతి ఆత్మహత్య

  • జీడిమెట్లలో గత శుక్రవారం ఘటన
  • ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య 
  • పెళ్లి ఇష్టం లేకే ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
MBA student in hyderabad commits suicide after parents arranges for marriage

తల్లిదండ్రులు తనకు ఇష్టంలేని పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. జీడిమెట్లలో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సుభాష్‌నగర్ లాస్ట్ బస్టాప్ ప్రాంతంలో ఉండే కరీంశెట్టి జన్ని, సత్యవతి దంపతుల కుమార్తె యువనాగదుర్గ (23) ఎంబీఏ చదువుతోంది. యువతికి పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రులు స్థానికంగా ఉండే ఓ పెయింటర్‌తో పెళ్లి నిశ్చయించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేశారు. కొన్ని నెలల తరువాత పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. 

కాగా, గత నెల 29న యువతి తల్లిదండ్రులు బయటకు వెళ్లారు. ఇంట్లో యువనాగదుర్గ, ఆమె సోదరుడు ఉన్నారు. ఈ క్రమంలో సోదరుడు భోజనం తెచ్చేందుకు బయటకు వెళ్లగా నాగదుర్గ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి ఇష్టం లేకే కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి పోలీసులకు తెలిపారు.

More Telugu News