శివన్న ఉగ్రరూపం.. ఫుల్ యాక్షన్‌తో ‘ఘోస్ట్’ ట్రైలర్
- శివరాజ్ కుమార్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా చిత్రం
- శ్రీని దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల
- జైలర్‌లో అతిథి పాత్రలో అలరించిన శివరాజ్
సాఫ్ట్‌గా ఉండే శివన్న వైలెంట్ మ్యాన్‌గా మారి శత్రువులను చీల్చి చెండాడుతూ ఉంటాడు. శివన్న విధ్వంసం వెనుక కారణాలేంటి? ఆయన ఉద్దేశం ఏంటనేది సస్పెన్స్‌గా ఉంచుతూ ట్రైలర్ మొత్తం యాక్షన్ తో నిండిపోయింది. ఈ సినిమా ఈనెల 19న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ప్రధాన పాత్రలు పొషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్ మొత్తం మూడు గెటప్స్‌లో అలరించనున్నాడు.