Vasireddy Padma: టీడీపీ నేత బండారు సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి లేఖ రాసిన వాసిరెడ్డి పద్మ

Vasireddy Padma wrote DGP to take action on TDP leader Bandaru Sathyanarayana
  • రోజాపై బండారు అసభ్యకర వ్యాఖ్యలు చేశాడన్న వాసిరెడ్డి పద్మ
  • అతడిని అరెస్ట్ చేయాలని డీజీపీకి స్పష్టీకరణ
  • టీడీపీ నేతలు రాజకీయ ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం
ఏపీ మంత్రి రోజాపై టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. రోజాపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని విమర్శించారు.

 ఒక మహిళా ప్రజాప్రతినిధిపై అటువంటి వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణను అరెస్ట్ చేయాలంటూ వాసిరెడ్డి పద్మ రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. తాను ఒక మాజీ మంత్రినన్న విషయం మర్చిపోయి, మంత్రి రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన బండారుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

తమ నాయకుడు చంద్రబాబును తప్పు చేసినందుకే అరెస్ట్ చేశారన్న వాస్తవాన్ని టీడీపీ నేతలు ఒప్పుకోలేకపోతున్నారని, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని ఇష్టానుసారం తిడుతున్నారని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
Vasireddy Padma
Bandaru Sathyanarayana
DGP
Roja
Chandrababu
Arrest
YSRCP
TDP

More Telugu News