Jagan: అక్టోబరు 16న విశాఖలో ఇన్ఫోసిస్ ను ప్రారంభించనున్న సీఎం జగన్

CM Jagan will inaugurate Infosys Center in Visakhapatnam

  • విశాఖలో ఇన్ఫోసిస్ ఐటీ సెంటర్ ఏర్పాటు
  • మంత్రి అమర్నాథ్ తో ఇన్ఫోసిస్ అధికారుల సమావేశం
  • ఎక్స్ లో వెల్లడించిన మంత్రి అమర్నాథ్

విశాఖలో నెలకొల్పిన ఇన్ఫోసిస్ ఐటీ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏపీ సీఎం జగన్ అక్టోబరు 16న ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. విశాఖలోని మధురవాడ సిగ్నిటివ్ టవర్స్ వద్ద ఇన్ఫోసిస్ డేటా సెంటర్ ను నిర్మించారు. ఈ నేపథ్యంలో, తాజాగా ఇన్ఫోసిస్ అధికారులు మంత్రి అమర్నాథ్ తో సమావేశమయ్యారు. ప్రారంభోత్సవం విషయమై ఆయనతో చర్చించారు.

విశాఖ ఇన్ఫోసిస్ కేంద్రంలో తొలుత 650 మందితో కార్యకలాపాలు నిర్వహించనున్నారు. త్వరలోనే 1000 మందితో  సేవలు అందించేలా విస్తరించనున్నారు. విశాఖ నుంచి సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్, ఐటీ అనుబంధ సేవలు, ఎంటర్ ప్రైజ్ అప్లికేషన్స్ తదితర సేవలు అందించాలని ఇన్ఫోసిస్ భావిస్తోంది.

Jagan
Infosys
Visakhapatnam
Gudivada Amarnath
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News