K V Vijayendra Prasad: దీన్ని ప్రజాస్వామ్యం అందామా?... సిగ్గుపడాల్సిన విషయం ఇది!: రచయిత విజయేంద్రప్రసాద్

  • ఓ కార్యక్రమంలో రాజకీయాలపై వ్యాఖ్యలు చేసిన విజయేంద్రప్రసాద్
  • దేశంలో 40 శాతం ఎంపీలు, ఎమ్మెల్యేలు నేరచరితులేనని వెల్లడి
  • నేర చరితులకు గెలుపు అవకాశాలు 15 శాతం ఉన్నాయని వివరణ
  • నేర చరిత్ర లేని వాళ్లకు గెలుపు అవకాశాలు 4 శాతమేనని వ్యాఖ్యలు
Vijayendra Prasad opines on present day politics

సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 40 శాతం మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. 

నేర చరిత్ర లేని వాళ్లకు గెలుపు అవకాశాలు 4 శాతం మాత్రమేనని, అదే నేర చరిత్ర ఉన్నవారికి గెలుపు అవకాశాలు 15 శాతం ఉన్నాయని ఓ అధ్యయనం చెబుతోందని విజయేంద్రప్రసాద్ వివరించారు. దీన్ని మనం ప్రజాస్వామ్యం అని ఎలా అంటాం? అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యం కానేకాదు, సిగ్గుపడాల్సిన విషయం అని విమర్శించారు. 

రాజ్యాంగంలో మార్పు చేస్తే తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడలేరని విజయేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎవరైనా ఆలోచించాలని, తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయేంద్రప్రసాద్ తో పాటు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ కూడా పాల్గొన్నారు.

More Telugu News