లండన్ లో అల్లు అర్జున్... లేటెస్ట్ ఫొటోలు ఇవిగో!

  • పుష్ప-2 షూటింగ్ కు విరామం
  • కుటుంబంతో కలిసి యూకే ట్రిప్ వెళ్లిన బన్నీ
  • ఈ నెల 29న స్నేహారెడ్డి పుట్టినరోజు
  • అర్ధాంగి పుట్టినరోజును లండన్ లో సెలబ్రేట్ చేయనున్న అల్లు అర్జున్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 షూటింగ్ కు విరామం ఇచ్చి కుటుంబంతో కలిసి లండన్ పయనమైన సంగతి తెలిసిందే. తాజాగా, అల్లు అర్జున్ లండన్ నుంచి ఫొటోలు పంచుకున్నారు. గ్రే కలర్ సూట్లో, స్టయిలిష్ కళ్లజోడుతో బన్నీ మెరిసిపోతుండడం ఈ ఫొటోల్లో చూడొచ్చు. కాగా, అల్లు అర్జున్ అర్ధాంగి స్నేహారెడ్డి సెప్టెంబరు 29న పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఆమె పుట్టినరోజును లండన్ లో సెలబ్రేట్ చేసుకునేందుకే బన్నీ కుటుంబంతో సహా యూకే ట్రిప్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. తిరిగి అక్టోబరు మొదటివారంలో హైదరాబాద్ చేరుకుని, పుష్ప-2 షూటింగ్ కు హాజరవుతారని సమాచారం.

Allu Arjun
London
Sneha Reddy
Birth Day
Pushpa-2
Icon Star
Tollywood

More Telugu News