Sree Leela: వరుస సినిమాలతో జోరుమీదున్న శ్రీలీల

Sree Leela on the rise with many projects in hand
  • పెళ్లిసందD చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల
  • ఆ తర్వాత ధమాకాతో గుర్తింపు
  • శ్రీలీల నటించిన స్కంద రేపు రిలీజ్
  • ఉస్తాద్ భగత్ సింగ్, గుంటూరు కారం చిత్రాల్లోనూ అమ్మడే హీరోయిన్

పెళ్లిసందD చిత్రంతో టాలీవుడ్ వెండితెరకు పరిచయమైన అచ్చ తెలుగు అందం శ్రీలీల. ఆ తర్వాత ధమాకా చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా రామ్ సరసన శ్రీలీల నటించిన స్కంద చిత్రం రేపు (సెప్టెంబరు 28) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

కాగా, తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో ఎదగడం కష్టం అనే అభిప్రాయాన్ని శ్రీలీల తొలగించింది. తొలి సినిమా ఓ మోస్తరుగా ఆడినప్పటికీ శ్రీలీల పెర్ఫార్మెన్స్ కు ఫుల్ మార్కులు పడ్డాయి. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఉన్న సినిమాలు చూస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. 

పవన్ కల్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, మహేశ్ బాబుతో గుంటూరు కారం చిత్రాల్లోనూ శ్రీలీలే హీరోయిన్. నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రంలో ఈ స్లిమ్ బ్యూటీ ఓ కీలక పాత్రలో కనువిందు చేయనుంది. నితిన్ సరసన ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్ లో, వైష్ణవ్ తేజ్ సరసన ఆదికేశవ చిత్రాల్లోనూ శ్రీలీల నటిస్తోంది.

  • Loading...

More Telugu News