Muttaiah Muralitharan: క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ కు నచ్చిన తెలుగు హీరో ఎవరంటే...!

Muttaiah Muralitharan says he likes Tollywood hero Nani acting
  • మురళీధరన్ జీవితంపై బయోపిక్
  • 800 టైటిల్ తో రూపుదిద్దుకున్న సినిమా
  • ఇటీవల హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • హాజరైన ముత్తయ్య మురళీధరన్ 
  • తన అభిమాన నటుడు నాని అని వెల్లడి 
శ్రీలంక ఆఫ్ స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా 800 అనే బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. పలు భారతీయ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముత్తయ్య మురళీధరన్ కూడా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ సినిమాలపై తన ఆసక్తిని వెల్లడించారు. తన అభిమాన నటుడు నాని అని వెల్లడించారు. నాటి హీరోగా వచ్చిన ఈగ, జెర్సీ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు చూశానని తెలిపారు. నాని నటనలోని భావోద్వేగాలు, నాటకీయత తనకు బాగా నచ్చుతాయని అన్నారు. నాని నటనలో వైవిధ్యం ఉంటుందని మురళీధరన్ పేర్కొన్నారు. గతంలో ఓసారి నానిని కలిసినప్పటికీ, మీరు నా అభిమాన యాక్టర్ అని చెప్పలేకపోయానని గుర్తుచేసుకున్నారు.
Muttaiah Muralitharan
Nani
Tollywood
800
Biopic
Sri Lanka
Cricket

More Telugu News