Jagan: ఐఎంఎఫ్ ను సందర్శించిన ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు... సీఎం జగన్ హర్షం

  • అమెరికాలో పర్యటిస్తున్న ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
  • ఇప్పటికే ఐక్యరాజ్యసమితి, కొలంబియా యూనివర్సిటీ సందర్శించిన వైనం
  • తాజాగా ఐఎంఎఫ్ కార్యాలయానికి వెళ్లిన విద్యార్థులు
  • హృదయం ఉప్పొంగుతోందన్న సీఎం జగన్ 
AP Students in US Tour visits IMF as CM Jagan felt happy

ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అమెరికాలో పర్యటిస్తుండడం తెలిసిందే. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి, కొలంబియా యూనివర్సిటీ వంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై ప్రసంగించిన ఏపీ విద్యార్థులు తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) కార్యాలయాన్ని కూడా సందర్శించారు. ఐఎంఎఫ్ అధికారి గీతా గోపీనాథ్ వారికి హార్దిక స్వాగతం పలికారు. దీనిపై ఏపీ సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. 

మా పిల్లలను కలుసుకున్నందుకు, వారికి ఘనస్వాగతం పలికినందుకు గీతా గోపీనాథ్ గారికి కృతజ్ఞతలు అంటూ ఎక్స్ లో స్పందించారు. విద్యార్థులు ఎంత సంతోషంగా ఉన్నారో వారి ముఖాలపై వెలుగుతున్న చిరునవ్వులే చెబుతున్నాయి అని వెల్లడించారు. వ్యక్తిగత జీవితాలనే కాదు, యావత్ సామాజిక జీవనాన్ని కూడా మార్చివేయగల శక్తి విద్యకు ఉందని తాను ప్రగాఢంగా విశ్వసిస్తానని సీఎం జగన్ పేర్కొన్నారు. అందుకు ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ప్రబల నిదర్శనం అని తెలిపారు.

 ప్రపంచ వేదికలపై మన పిల్లలు ఆత్మవిశ్వాసంతో తమ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తుండడం చూస్తుంటే నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతోంది అని వివరించారు.

More Telugu News