Nithya Menen: వేధింపుల ఆరోపణలను ఖండించిన నిత్యా మీనన్

  • తమిళ్ హీరో వేధించాడంటూ కథనాలు
  • వీటిని అవాస్తవాలుగా పేర్కొంటూ ఖండించిన నిత్య
  • తాను ఎప్పుడూ అలా చెప్పలేదని స్పష్టీకరణ
Nithya Menen BREAKS Silence on Alleged Tamil Hero Harassed Me Comment

దక్షిణాదికి చెందిన ప్రముఖ నటి నిత్యా మీనన్.. ఓ తమిళ హీరో తనను వేధింపులకు గురిచేశాడంటూ వస్తున్న కథనాలను కొట్టి పారేసింది. ఓ సినిమా చిత్రీకరణ సమయంలో తమిళ్ హీరో వేధించినట్టు వచ్చిన కథనాలపై స్పందించింది. ‘‘తెలుగు పరిశ్రమలో నేను ఎప్పుడూ ఇబ్బందులు ఎదుర్కోలేదు. కానీ, తమిళ పరిశ్రమలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఓ సినిమా షూటింగ్ లో భాగంగా తమిళ హీరో నన్ను వేధింపులకు గురి చేశాడు’’ అంటూ నిత్యా మీనన్ చెప్పినట్టుగా కథనాలు వెలుగులోకి వచ్చాయి. 

ఈ వార్తలకు సంబంధించి ఓ స్క్రీన్ షాట్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘తప్పుడు కథనాలు ప్రసారం చేయవద్దంటూ నిత్యా మీనన్ కోరింది. ‘‘జర్నలిజంలో కొన్ని వర్గాలు ఈ స్థాయికి దిగజారడం ఎంతో బాధను కలిగిస్తోంది. దీనికంటే మెరుగ్గా ఉండాలని కోరుతున్నాను’’ అంటూ పోస్ట్ పెట్టింది. ‘‘ఇది పూర్తిగా అవాస్తవం. నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఈ వదంతుల వ్యాప్తిని ఎవరు మొదలు పెట్టారో చెప్పండి. కేవలం క్లిక్ ల కోసం ఈ తరహా అవాస్తవాలను ప్రచారం చేసే వారిని బాధ్యులను చేయాలి’’ అని నిత్య మీనన్ మండిపడింది.

More Telugu News