Nara Lokesh: మళ్లీ ప్రారంభం కానున్న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర... ముహూర్తం ఖరారు

Nara Lokesh Yuvagalam Padayatra will start from September 29
  • ఇవాళ టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం
  • భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు
  • లోకేశ్ పాదయాత్ర ఎక్కడ ఆగిపోయిందో అక్కడ్నించే మొదలవుతుందని వెల్లడి
  • ఈ నెల 29న యువగళం పునఃప్రారంభం అని ప్రకటన 
ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. 

లోకేశ్ పాదయాత్ర ఎక్కడ ఆగిపోయిందో అక్కడినుంచే ప్రారంభమవుతుందని వెల్లడించారు. సెప్టెంబరు 29న లోకేశ్ పాదయాత్ర పునఃప్రారంభం అవుతుందని తెలిపారు. కక్షసాధింపులే ధ్యేయంగా జగన్ సర్కార్ రోజుకొకటిగా తెరపైకి తెస్తున్న తప్పుడు అంశాలపై ప్రజల్లోనే తేల్చుకోవాలని టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నిర్ణయించిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

"నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారు. దీనిపై కూడా సమావేశంలో చర్చించాం. చంద్రబాబు అక్రమ అరెస్ట్ తో నిలిచిపోయిన పాదయాత్రను తిరిగి శుక్రవారం రాత్రి 8.15 నిమిషాల నుంచి రాజోలు నుంచే ప్రారంభించాలని లోకేశ్ తోపాటు మేమంతా ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నాం. పాద యాత్ర కొనసాగింపునకు అన్ని అనుమతులు తీసుకున్నాం" అని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
Nara Lokesh
Yuva Galam Padayatra
Rajolu
TDP
PAC
Atchannaidu
Andhra Pradesh

More Telugu News