KTR: కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత, ట్వీట్ చేసిన కేటీఆర్

  • వారం రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని వెల్లడి
  • వైద్యుల పర్యవేక్షణలో ఇంట్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపిన మంత్రి
  • కొన్ని రోజుల్లో సాధారణ స్థితికి చేరుకుంటారని డాక్టర్లు చెప్పినట్లు వెల్లడి
KCR suffering from fever says ktr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వారం రోజులుగా కేసీఆర్ వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నట్లుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ ద్వారా వెల్లడించారు. వైద్యుల పర్యవేక్షణలో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు. కొన్ని రోజుల్లో సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు చెప్పారన్నారు.

More Telugu News