సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

Telangana good news for singareni employees
  • సంస్థ లాభాల్లో ఉద్యోగులకు, కార్మికులకు 32 శాతం వాటా ఇవ్వాలని నిర్ణయం
  • 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంస్థ సాధించిన లాభాల్లో వాటా చెల్లించేందుకు ఆదేశాలు
  • రూ.2,222 కోట్ల లాభాలకు గాను రూ.700 కోట్లను దసరాకు ముందస్తుగా చెల్లింపు!
సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంస్థ లాభాల్లో ఉద్యోగులకు వాటా ఇవ్వాలని నిర్ణయించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను లాభాల్లో ఉద్యోగులకు 32 శాతం వాటా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ సాధించిన లాభాల్లో 32 శాతం వాటా చెల్లించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రూ.2,222 కోట్ల రికార్డుస్థాయి లాభాలను ఆర్జించింది. ఇందులో రూ.700 కోట్లకు పైగా లాభాలను కార్మికులకు దసరా ముందస్తుగా చెల్లించనున్నట్లు కేసీఆర్‌ కొన్నిరోజుల క్రితం చెప్పారు.
Go Back to Shorts
singareni
Telangana
KCR

More Telugu News