'మంగళవారం' టీమ్ నుంచి అధికారిక ప్రకటన .. రిలీజ్ డేట్ ఇదే!

  • అజయ్ భూపతి రూపొందించిన 'మంగళవారం'
  • సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
  • ప్రధానమైన పాత్రలలో పాయల్ - నందిత శ్వేత
  • నవంబర్ 17వ తేదీన సినిమా విడుదల
జయాపజయాల సంగతి అలా ఉంచితే, వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ అజయ్ భూపతి ముందుకు వెళుతున్నాడు. పాయల్ తో ఆయన చేసిన 'RX 100' తరువాత, ఇద్దరికీ కూడా మరో హిట్ లేదు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'మంగళవారం' సినిమా రూపొందింది. స్వాతి - సురేశ్ వర్మ ఈ సినిమాను నిర్మించారు. 

ఇది సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. గ్రామీణ నేపథ్యంలో 1980-90ల మధ్య కాలంలో ఈ కథ నడుస్తుంది. అందుకు తగిన వాతావరణం స్క్రీన్ పై కనిపించడానికి అజయ్ భూపతి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆయన టేకింగ్ తో పాటు అజనీశ్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి అదనపు బలంగా నిలుస్తుందని అంటున్నారు. 

ఫస్టు పోస్టర్ వదిలిన దగ్గర నుంచి ఈ సినిమా ఎప్పుడు థియేటర్స్ కి వస్తుందా అని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. నవంబర్ 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతూ, రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. నందిత శ్వేత .. అజయ్ ఘోష్ .. అజ్మల్ .. దివ్య పిళ్లై ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

Payal
Nanditha Swetha
Ajay Bhupathi
Mangalavaram

More Telugu News