ప్రభాస్‌ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల!

Sreeleela may play the heroine in Prabhas next movie
  • హను రాఘవపూడి తర్వాతి సినిమాలో హీరోగా ప్రభాస్!
  • సీతారామంతో భారీ హిట్ అందుకున్న హను
  • తెలుగులో బిజీగా శ్రీలీల
‘పెళ్లి సందD’ చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన యువ నటి శ్రీలీల. అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోలతో నటించే స్థాయికి ఎదిగింది. చూస్తుండగానే స్టార్ హీరోయిన్‌ గా ఊపందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆమె అంత్యత బిజీగా ఉంది. యువ హీరోలతో పాటు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోల సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం శ్రీలీల నటించిన నాలుగు సినిమాలు వరుసగా విడుదల కాబోతున్నాయి. పోతినేని రామ్‌ సరసన నటించిన స్కంద చిత్రం ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు ఆమెకు మరో భారీ ఆఫర్ వచ్చింది. 

ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభాస్ తదుపరి ప్రాజెక్ట్‌లో శ్రీలీల హీరోయిన్‌గా నటించనుందని వార్తలు వస్తున్నాయి. ‘సీతా రామం’ సినిమాతో బ్లాక్‌ బస్టర్ విజయం అందుకున్న దర్శకుడు హను రాఘవపూడి రెబల్ స్టార్ ప్రభాస్‌కు కథ వినిపించాడని, అది ప్రభాస్‌కు నచ్చిందని టాలీవుడ్‌ సర్కిల్‌లో టాక్‌ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ ప్రాజెక్ట్‌ ను నిర్మించే అవకాశం ఉంది. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల పేరును పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఈ ఆఫర్ శ్రీలీల చేతికి వస్తే ఆమె కెరీర్‌‌ మరో మెట్టుకు ఎక్కనుంది. ఈ సినిమా విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Go Back to Shorts
sreeleela
Prabhas
hanu raghavapudi

More Telugu News