Next pandemic: తదుపరి మహమ్మారి 5 కోట్ల మందిని బలి తీసుకుంటుంది: నిపుణుల అంచనా

  • డిసీజ్ ఎక్స్ వచ్చే క్రమంలో ఉందన్న ప్రచంచ ఆరోగ్య సంస్థ
  • దీని కారణంగా ఐదు కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని బ్రిటన్ నిపుణుడి అంచనా
  • చుట్టూ ఉన్న వైరస్ లే ప్రాణాంతకంగా పరిణమించొచ్చని విశ్లేషణ
Next pandemic already on its way disease X could kill 50 million Experts

2020లో వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని బలితీసుకుంది. అయితే, తదుపరి మరింత విధ్వంసకరమైన మహమ్మారి రాకకు కరోనా కేవలం నాందీయేనని ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ నిపుణులు కొందరు అంటున్నారు. బ్రిటన్ టీకాల టాస్క్ ఫోర్స్ కు అధ్యక్షురాలిగా పనిచేసిన డేమ్ కేట్ బింగమ్ దీనిపై తీవ్ర హెచ్చరిక చేశారు. భవిష్యత్తులో వచ్చే మహమ్మారి కనీసం 5 కోట్ల మంది ప్రాణాలను బలి తీసుకుంటుందని పేర్కొన్నారు. కరోనా ఈ స్థాయిలో ప్రాణాలు పోవడానికి కారణం కాకపోవడం అదృష్టకరమన్నారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారిక గణాంకాల ప్రకారం కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ, అనధికారికంగా దీనికి మరో రెండు రెట్లు ఎక్కువే ప్రాణ నష్టం జరిగి ఉంటుందని (సుమారు 2 కోట్ల వరకు) కొందరి అభిప్రాయం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే తదుపరి మహమ్మారి ‘డిసీజ్ ఎక్స్’ ఇప్పటికే వచ్చే క్రమంలోనే ఉందని పేర్కొంది. కరోనా కంటే ఏడు రెట్లు అధికంగా డిసీజ్ ఎక్స్ తో ప్రాణాలు కోల్పోతారని కేట్ బింగమ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత  వైరస్ నుంచే తదుపరి ప్రాణాంతక మహమ్మారి ఉద్భవించొచ్చన్నారు.

1918-19లో వచ్చిన ఫ్లూ వల్ల 5 కోట్ల మంది మరణించగా, తదుపరి మహమ్మారి కూడా ఇదే తీవ్రతతో ఉంటుందని కేట్ బింగమ్ పేర్కొన్నారు. డిసీజ్ ఎక్స్ మీజిల్స్, ఎబోలా తదితర వైరస్ స్థాయిలో వ్యాప్తిని కలిగి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న వైరస్ లతోనే ఈ స్థాయి ప్రాణ నష్టం సంభవించొచ్చన్నారు. అన్ని వైరస్ లు మానవాళికి ముప్పు కలిగించకపోయినా, కొన్ని ప్రాణాంతకంగా మారతాయన్నారు. సైంటిస్టులు సుమారు 25 వైరస్ కుటుంబాలను పరిశీలిస్తున్నారని.. ప్రతి కుటుంబంలో వేలాది విడి వైరస్ లు ఉన్నట్టు ఆమె చెప్పారు. కొన్ని వైరస్ లు ప్రమాదకరంగా మ్యుటేషన్ చెందొచ్చన్నారు.

More Telugu News