Suryakumar: సిక్స్ లతో హోరెత్తించిన సూర్యకుమార్.. వీడియో ఇదిగో!

Suryakumar Yadavs Explosive Batting Against Cameron Green Goes Viral
  • ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ లో పరుగుల వరద
  • వరుసగా నాలుగు సిక్స్ లు బాదిన సూర్యకుమార్
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ లో భారత జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ లు సెంచరీలతో రెచ్చిపోగా తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా అదే ఊపును కొనసాగించాడు. వరుస బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కెమెరాన్ గ్రీన్ వేసిన ఒకే ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్ లు బాదాడు. 37 బంతుల్లో 72 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. ఈ మ్యాచ్ లో బౌండరీలతో ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

కెమెరాన్ గ్రీన్ వేసిన 43వ ఓవర్ లో మొదటి నాలుగు బంతులను వరుసగా సిక్స్ లు గా మలిచాడు. మొదటి బంతిని డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లో బౌండరీకి పంపిన యాదవ్.. రెండో బంతిని ఫైన్ లెగ్ మీదుగా బౌండరీ లైన్ దాటించాడు. దీంతో వ్యూహం మార్చిన గ్రీన్.. మూడో బంతిని ఆఫ్ స్టంప్ కు అవతలి వైపు విసరగా యాదవ్ దానిని డీప్ ఎక్స్ ట్రా కవర్ మీదుగా సిక్స్ బాదాడు. తర్వాత ఫుల్ లెంగ్త్ డెలివరీని యాదవ్ డీపీ మిడ్ వికెట్ మీదుగా ప్రేక్షకుల గ్యాలరీకి పంపించాడు.
Suryakumar
Explosive Batting
consecutive sixes
Cameron Green

More Telugu News