Air India: టేకాఫ్ చేసిన గంటకే తిరిగొచ్చిన విమానం.. విశాఖ విమానాశ్రయంలో ఘటన

Airflight which took off from vizag airport returned after technical snag
  • ఆదివారం 5.30కు ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం
  • సాంకేతిక సమస్య తలెత్తడంతో మరో గంటకే విమానాశ్రయానికి తిరిగొచ్చిన వైనం
  • ఆ సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు
  • రాత్రి 9.30కు ఎస్టీ కమిషన్ సభ్యులను మరో విమానంలో ఢిల్లీకి తరలింపు
  • ఇతరులకు భోజనం, వసతి ఏర్పాట్లు చేసిన ఎయిర్ ఇండియా
విశాఖపట్నం నుంచి ఆదివారం సాయంత్రం బయలుదేరిన ఓ ఎయిర్‌‌ ఇండియా విమానం గంటకే తిరిగొచ్చేసింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని వెనక్కు మళ్లించాల్సి వచ్చింది. దీంతో, సాయంత్రం 5.30కు బయలుదేరిన విమానం ఆరున్నర కల్లా విమానాశ్రయానికి తిరిగొచ్చేసింది. ఆ సమయంలో విమానంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు అనంత్‌నాయక్‌, మరో ముగ్గురు సభ్యులు ప్రయాణిస్తున్నారు. కాగా, రాత్రి తొమ్మిదిన్నరకు వారిని ఎయిర్‌ఇండియా మరో విమానంలో ఢిల్లీకి పంపించింది. మిగిలిన 165 మంది ప్రయాణికులకు వసతి, భోజనం ఏర్పాట్లు చేసింది.
Air India
Vizag

More Telugu News