Nagababu: చంద్రబాబు అరెస్ట్ నాకు బాధ కలిగించింది: నాగబాబు వ్యాఖ్య

  • చంద్రబాబు అరెస్ట్‌పై జనసైనికులు కూడా ఆవేదనగా ఉన్నారని వ్యాఖ్య
  • పొత్తును జనసైనికులు స్వాగతిస్తున్నారని వెల్లడి
  • ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని స్పష్టీకరణ
  • అవినీతి, అక్రమార్కులకు జనసేనలో సీట్లు ఇవ్వమని వెల్లడి
Nagababu on Chandrababu Naidu arrest

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారని జనసేన నేత నాగబాబు అన్నారు. ఆయన తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టీడీపీ అధినేత అరెస్ట్ తనకు బాధ కలిగించిందన్నారు. ఆయన అరెస్ట్ పైన జనసైనికులు కూడా ఆవేదనగా ఉన్నారన్నారు. టీడీపీ, జనసేన పొత్తును జనసైనికులు స్వాగతిస్తున్నారని తెలిపారు.

అయితే ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది మాత్రం పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని నాగబాబు అన్నారు. టీడీపీతో పొత్తు ఉంటుందని, అదే సమయంలో బీజేపీతో పొత్తుపై త్వరలో స్పష్టత వస్తుందన్నారు. కోట్లాది రూపాయల ఆస్తులున్న నేతలు జనసేనకు అవసరం లేదని, ప్రజాసేవకులు తమకు ముఖ్యమన్నారు. అవినీతిపరులు, అక్రమార్కులకు జనసేనలో సీట్లు ఇచ్చేది లేదన్నారు. ప్రజలకు సేవ చేసే ఆలోచన ఉన్నవారికే టిక్కెట్ ఇస్తామన్నారు.

More Telugu News