Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తర కొరియా తరహా పాలన: వీడియో షేర్ చేసిన నారా లోకేశ్

Nara Lokesh shares a videos in x
  • ఐటీ ఉద్యోగుల ర్యాలీని ఆపేందుకు పోలీసులను మోహరించారని ఆగ్రహం
  • ప్రజల ఫోన్లలో వాట్సాప్ యాప్‌ను తనిఖీ చేయడం దారుణమని వ్యాఖ్య
  • వ్యక్తుల గోప్యతకు పోలీసులు భంగం కలిగించారన్న లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరకొరియా తరహా పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఆదివారం ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు ర్యాలీ చేపట్టాలని భావించారు. ఓ ఐటీ ఉద్యోగి కారులో వెళ్తుండగా ఆపిన పోలీసులు, అతని వాట్సాప్‌ను చెక్ చేస్తున్న ఓ వీడియోను లోకేశ్ పోస్ట్ చేసి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

ఐటీ ఉద్యోగుల కారు ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారని పేర్కొన్నారు. పౌరుల ఫోన్‌లలోని వాట్సాప్ మెసెంజర్ యాప్‌ను పోలీసులు తనిఖీ చేయడం దారుణమన్నారు. ఇవి ఆందోళన రేకెత్తించే అంశాలు అన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ఒక వ్యక్తి యొక్క గోప్యతను హరించవద్దని, కానీ ఏపీలో అలా జరగడం లేదన్నారు. ఉత్తర కొరియా తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య సూత్రాలను తుంగలో తొక్కుతున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారన్నారు. ఐటీ ఉద్యోగుల ర్యాలీని ఆపేందుకు పోలీసుల మోహరింపు సిగ్గుచేటు అన్నారు.
Nara Lokesh
Chandrababu
Andhra Pradesh
YS Jagan

More Telugu News