Uttar Pradesh: భార్యపై సామూహిక లైంగిక దాడి.. విషం తాగి దంపతుల ఆత్మహత్య

UP couple dies by consuming poison Hours after wifes gang rape
  • ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఘటన
  • ఇంట్లోకి చొరబడి ఇద్దరు వ్యక్తుల అత్యాచారం
  • భూమి అమ్మకంతో ఈ ఘటనకు సంబంధం ఉందన్న పోలీసులు
సామూహిక లైంగిక దాడికి గురైన వివాహిత.. ఆ తర్వాత కొన్ని గంటలకే భర్తతో కలిసి విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో జరిగిందీ ఘటన. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 30 ఏళ్ల భర్త, 27 ఏళ్ల అయన భార్య గురువారం విషం తీసుకుని ఆత్మహత్యకు యత్నించారు. భర్త అదే రోజు మరణించగా, గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ శుక్రవారం మృతి చెందింది. 

20న రాత్రి ఇద్దరు వ్యక్తులు బాధితురాలి ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన వీడియోలో నిందితుల పేర్లను బాధితులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదర్శ్ (25), త్రిలోకి (45)ని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి, బాధితుల భూమి అమ్మకానికి సంబంధం ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు పోలీసులు తెలిపారు.
Uttar Pradesh
Gang Rape
Crime News

More Telugu News