2030 నాటికి ధూమపాన రహిత దేశంగా బ్రిటన్.. సిగరెట్లపై నిషేధం
- నవతరాన్ని ధూమపానానికి దూరంగా ఉంచాలని నిర్ణయం
- 2009 జనవరి 1 తర్వాత జన్మించిన వారికి సిగరెట్లు అమ్మకుండా నిషేధం
- విధివిధానాల రూపకల్పనకు సమాయత్తం
- గతేడాది న్యూజిలాండ్ కూడా నిషేధం
‘‘2030 నాటికి ధూమపాన రహిత దేశంగా మార్చేలా మరింతమందిని ప్రోత్సహించాలనుకుంటున్నాం. అందులో భాగంగా ధూమపాన రేటును తగ్గించేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నాం’’ అని బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. గర్భిణులు ధూమపానాన్ని విడిచిపెట్టేలా ప్రోత్సహించే ఉచిత వేప్ (పొగపీల్చేందుకు ఉపయోగించే గొట్టం) కిట్ల వోచర్ పథకం కూడా ప్రభుత్వం తీసుకునే చర్యల్లో ఉండనుంది.