Sharad Pawar: గౌతమ్ అదానీతో కలిసి ఫ్యాక్టరీని ప్రారంభించిన శరద్ పవార్

Sharad Pawar visits Adani office residence in Ahmedabad
  • శనివారం అదానీ గ్రూప్ అధినేతను కలిసిన శరద్ పవార్
  • అహ్మదాబాద్ లోని ఓ గ్రామంలో ఫ్యాక్టరీ ప్రారంభం సందర్భంగా కలయిక
  • ఫోటోలు షేర్ చేసిన శరద్ పవార్
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ శనివారం అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీని కలిశారు. అహ్మదాబాద్‌లోని సనంద్ జిల్లాలోని ఓ గ్రామంలో వీరిద్దరు కలిసి ఓ ఫ్యాక్టరీని ప్రారంభించారు. అనంతరం అహ్మదాబాద్‌లోని అదానీ నివాసానికి, ఆ తర్వాత అదానీ కార్యాలయానికి శరద్ పవార్ వెళ్లారు. 

తాను అదానీని కలిసినట్లు శరద్ పవార్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీరిద్దరు కలిసి ఫ్యాక్టరీని ప్రారంభించిన ఫోటోను కూడా పంచుకున్నారు. వీరిద్దరి మధ్య ఏం అంశాలు చర్చకు వచ్చాయో వెల్లడించలేదు.
Sharad Pawar
Gautam Adani
Gujarat

More Telugu News