Narendra Modi: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు

  • ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 30న రావాల్సిన ప్రధాని
  • అక్టోబర్ 1కి మారిన ప్రధాని పర్యటన 
  • వచ్చే నెలలో అగ్రనేతలతో వరుస సభలు నిర్వహించే అవకాశం
changes in PM Modis telangana tour

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 30న తెలంగాణకు రావాల్సి ఉంది. కానీ ప్రధాని పర్యటన అక్టోబర్ 1కి మారింది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్‌లో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. రానున్న డిసెంబర్ లోపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి కీలక కార్యాచరణకు ఈ నెలాఖరు లోపు తుది రూపు ఇచ్చి అక్టోబర్ నెలలో ప్రధాని సహా అగ్రనేతల సభలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. అదే నెలలో అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది.

More Telugu News