ప్రజావేదిక కూల్చివేత మొదలు... అరాచక పాలన ప్రారంభమైంది: పురందేశ్వరి
- టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ తమ పార్టీ అధిష్ఠానానికి వివరిస్తామన్నారని వెల్లడి
- పొత్తులపై కేంద్ర నాయకత్వానిదే తుది నిర్ణయమన్న పురందేశ్వరి
- ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం
అమరావతిలో ప్రజావేదిక కూల్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచక పాలన మొదలైందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం, కక్షధోరణితో ముందుకు సాగుతోందని, ఇది చాలా బాధాకరమన్నారు. ఓ వైపు మోదీ మహిళా సాధికారత కోసం తపనపడుతుంటే, ఏపీలో మాత్రం మద్యం కోసం తపనపడుతున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేసుకున్నామన్నారు.