ప్రధాని మోదీకి 'నమో' అని రాసి ఉన్న టీమిండియా జెర్సీని బహూకరించిన సచిన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రధాని మోదీకి 'నమో' అని రాసి ఉన్న టీమిండియా జెర్సీని బహూకరించిన సచిన్

Sachin presents Team India jersey to PM Modi
  • వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
  • శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ
  • హాజరైన క్రికెట్ ప్రముఖులు
  • సచిన్ చేతుల మీదగా జెర్సీ అందుకుని హర్షం వ్యక్తం చేసిన ప్రధాని
ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ నేడు శంకుస్థాపన చేశారు. ఇక్కడి గంజారి ప్రాంతంలో భూమి పూజ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బోర్డు కార్యదర్శి జై షా, మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, రవి శాస్త్రి తదితరులు హాజరయ్యారు.

కాగా, ఈ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ ప్రధాని నరేంద్ర మోదీకి టీమిండియా జెర్సీని బహూకరించారు. 'నమో' అని రాసి ఉన్న ఆ ప్రత్యేకమైన జెర్సీని సచిన్ చేతుల మీదుగా అందుకున్న మోదీ హర్షం వ్యక్తం చేశారు.
Advertisement
Sachin Tendulkar
Narendra Modi
Team India Jersey
Varanasi
International Stadium
Uttar Pradesh

More Telugu News