YVS: మళ్లీ రంగంలోకి దిగుతున్న వైవీఎస్ చౌదరి!

YVS  new movie update
  • గతంలో వరుస సినిమాలు చేసిన వైవీఎస్ చౌదరి 
  • కొంతకాలంగా సినిమాలకి దూరం
  • మళ్లీ మెగాఫోన్ పడుతున్న దర్శకుడు 
  • త్వరలో వెలువడనున్న అధికారిక ప్రకటన

దర్శకుడిగా కెరియర్ ఆరంభంలోనే మంచి సక్సెస్ లను .. క్రేజ్ ను వైవీఎస్ చౌదరి చూశాడు. 'శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి' సినిమాతో ఆయన కెరియర్ మొదలైంది. ఆ తరువాత చేసిన 'లాహిరి లాహిరి లాహిరిలో' .. 'సీతయ్య' .. 'దేవదాసు' వంటి సినిమాలు ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

'ఒక్క మగాడు' సినిమా నుంచి ఆయన అంతగా కలిసి రాలేదు. వరుస పరాజయాలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. 2015 నుంచి ఆయన వైపు నుంచి ఇక సినిమాలు రాలేదు. మళ్లీ ఇంతకాలానికి ఇప్పుడు ఆయన మరో ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకుని వెళ్లడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

తన మొదటి సినిమా మాదిరిగానే అంతా కొత్త ఆర్టిస్టులతో ఆయన ఈ సినిమాను రూపొందించనున్నట్టుగా తెలుస్తోంది. సాంకేతికవర్గం వైపు మాత్రం సీనియర్ టెక్నీషియన్స్ పనిచేయనున్నట్టు చెబుతున్నారు. కీరవాణి సంగీతాన్ని అందించనున్నారని సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి. 

  • Loading...

More Telugu News