Team India: తొలి వన్డే: ఆసీస్ పై టాస్ గెలిచిన భారత్

  • త్వరలో వరల్డ్ కప్
  • మెగా టోర్నీ కోసం భారత్, ఆసీస్ సన్నాహాలు
  • నేటి నుంచి మూడు వన్డేల సిరీస్
  • ఇవాళ మొహాలీలో మొదటి వన్డే... టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న భారత్
Team India won the toss in 1st ODI with Aussies

ఐసీసీ వరల్డ్ కప్ సమీపిస్తుండడంతో ప్రధాన జట్లన్నీ సన్నాహాలు షురూ చేశాయి. ఈ క్రమంలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. నేడు మొహాలీలో ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే, ఆసీస్ బ్యాట్స్ మన్ దూకుడుగా ఆడుతూ భారత బౌలర్లకు సవాల్ విసురుతున్నారు. 

ఆసీస్ జట్టు తొలి ఓవర్లోనే ఓపెనర్ మిచెల్ మార్ష్ (4) వికెట్ కోల్పోయింది. షమీ బంతిని ఆడబోయిన మార్ష్.. గిల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అక్కడ్నించి మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఫామ్ లో ఉన్న స్టీవ్ స్మిత్ మరో వికెట్  పడకుండా జాగ్రత్త పడ్డారు. వీరిరువురు వికెట్ కాపాడుకుంటూనే, భారత బౌలర్లపై వీలుచిక్కినప్పుడుల్లా ఎదురుదాడి చేశారు. 

ప్రస్తుతం ఆసీస్ స్కోరు 18 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 98 పరుగులు. వార్నర్ (52 బ్యాటింగ్) అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, స్టీవ్ స్మిత్ 37 పరుగులతో ఆడుతున్నాడు.

More Telugu News