Chandrababu: హైకోర్టులో చంద్రబాబుకు నిరాశ.. సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో టీడీపీ

Chandrababu lawyers challenging AP High Court verdict in Supreme Court
  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో హైకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ
  • క్వాష్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు
  • సుప్రీంకోర్టులో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్న బాబు లాయర్లు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో టీడీపీ సవాల్ చేయనుంది. ఈ కేసును సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని చంద్రబాబు తరపు లాయర్లు నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలోని సీనియర్ లాయర్లతో నారా లోకేశ్, టీడీపీ నేతలు చర్చిస్తున్నారు. ఇంకోవైపు కాసేపట్లో చంద్రబాబు పోలీస్ కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించనుంది.

  • Loading...

More Telugu News