Chandrababu: అంగళ్లు అల్లర్ల కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేసిన హైకోర్టు

AP High Court adjourned the hearing of Chandrababu bail petition in Angallu case
  • అంగళ్లు అల్లర్ల కేసులో ఏ1గా చంద్రబాబు
  • హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేసిన బాబు
  • తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసిన హైకోర్టు
ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లులో చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. టీడీపీ శ్రేణులను చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే అల్లర్లు జరిగాయంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా చేర్చారు. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది.
Chandrababu
Telugudesam
Angallu Case
AP High Court
Bail

More Telugu News