గ్రామాల్లో కుక్కల కంటే అధ్వానంగా మాట్లాడుతున్నారు.. టీడీపీ సభ్యులపై డిప్యూటీ సీఎం తీవ్ర వ్యాఖ్యలు
- అసెంబ్లీలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వివాదాస్పద కామెంట్స్
- చంద్రబాబు అరెస్టుపై దద్దరిల్లుతున్న ఏపీ అసెంబ్లీ
- పోడియం వద్ద ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్షల్స్
ఈ క్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సభలో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను ఊర కుక్కలతో పోల్చారు. గ్రామాల్లో కుక్కల కంటే అధ్వాన్నంగా మాట్లాడుతున్నారని నారాయణ స్వామి విమర్శించారు. దీనిపై సభలో మరింత గందరగోళం నెలకొంది. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళన కొనసాగుతోంది.