Skill Development Case: ‘స్కిల్’ కేసును సీబీఐకి అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పిల్

  • కేసు ఆర్థికాంశాలు పలు రాష్ట్రాలతో ముడిపడి ఉన్నాయన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్
  • ప్రముఖులు నిందితులుగా ఉన్నారని పేర్కొన్న వైనం
  • కాబట్టి, కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ జరపాలని విజ్ఞప్తి
  • చంద్రబాబు, అచ్చెన్నాయుడు సహా 44 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం
Undavalli files Petition in High court for CBI probe into Skill Development Case

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నమోదైన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ కేసులోని ఆర్థిక అంశాలు పలు రాష్ట్రాలతో ముడిపడి ఉన్నాయని ఉండవల్లి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రముఖ వ్యక్తులు కూడా నిందితులుగా ఉండటం వల్ల కేంద్ర దర్యాప్తు సంస్థతో ఈ కేసును దర్యాప్తు చేయించాలని కోరారు. 

కేంద్ర హోం శాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సీఐడీ, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, గంటా సుబ్బారావు, కె. లక్షీనారాయణ, నిమ్మగడ్డ వెంకటకృష్ణ ప్రసాద్, డిజైన్‌టెక్ సంస్థ, సంస్థ ఎండీ వికాస్ ఖన్వేల్కర్, స్కిల్లర్ ఎంటర్‌ప్రైజెస్, సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్, మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా 44 మందిని ఉండవల్లి తన పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు.

More Telugu News