rbi: 'ఉద్దేశపూర్వక ఎగవేతదారుల'పై రుణసంస్థలకు ఆర్బీఐ కీలక మార్గదర్శకాలు

  • ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై ఇప్పటి వరకు ఎలాంటి కాలవ్యవధి లేదు
  • ఇప్పుడు ఆరు నెలల్లో ప్రకటించాలని ప్రతిపాదించిన ఆర్బీఐ
  • అక్టోబర్ 31లోపు వాటాదారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని సూచన
RBI proposes lenders identify wilful defaulters within six months

అప్పు ఎగవేతదారులకు సంబంధించి కేంద్ర బ్యాంకు ఆర్బీఐ కీలక మార్గదర్శకాలు ప్రతిపాదించింది. దీని ప్రకారం అకౌంట్లు నిరర్థకంగా మారిన 6 నెలల్లోపు బ్యాంకులు, రుణ సంస్థలు సదరు రుణగ్రహీతలను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించాలి. ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి కాలవ్యవధి లేదు. ఇప్పుడు ఆరు నెలల్లోగా ఉద్దేశపూర్వక ఎగవేతదారులను ప్రకటించాలని ప్రతిపాదించింది.

ఈ ప్రక్రియలో భాగంగా సమీక్షా కమిటీని ఏర్పాటు చేయాలని బ్యాంకులకు, ఎన్బీఎఫ్‌సీలకు సూచిస్తోంది. అదే సమయంలో రుణగ్రహీత రాతపూర్వకంగా సమాధానం ఇచ్చేందుకు పదిహేను రోజుల గడువు ఇవ్వాలని, అవసరమైతే వ్యక్తిగత విచారణకు అవకాశం ఇవ్వాలని... ఈ మేరకు ఆర్బీఐ తన డ్రాఫ్ట్ మాస్టర్ ఆదేశాలలో స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి డ్రాఫ్ట్‌పై వాటాదారులు అక్టోబర్ 31వ తేదీలోగా తమ అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది.

More Telugu News