WWE match: జపాన్ లో బుల్లెట్ రైల్లో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్

A WWE Style Match On Bullet Train In Japan Stuns Passengers
  • ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన టోక్యో సంస్థ
  • టోక్యో - షింకషేన్ మార్గంలో 30 నిమిషాల పాటు మ్యాచ్
  • 30 నిమిషాల్లోనే అమ్ముడుపోయిన టికెట్లు
డబ్ల్యూడబ్ల్యూఈ గేమ్ లను చూసే ఉంటారు. టీవీ చానళ్లలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం.. కదిలే రైలులో కళ్లముందే ప్రత్యక్షంగా కనిపిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. జపాన్ లోని ఓ బుల్లెట్ రైలులో ఇద్దరు రెజ్లర్లు (మల్లయోధులు) ఇలానే పోటీపడ్డారు. టోక్యోకు చెందిన డీడీటీ ప్రో రెజ్లింగ్ అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 75 మంది ప్రయాణికులు దీన్ని వీక్షించారు. 

మినోరు సుజుకి, సన్షిరో తకాజి మధ్య జరిగిన మల్లయుద్ధం పోటీని రైలులో చూసేందుకు ఉద్దేశించిన టికెట్లు అన్నీ కూడా 30 నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. టోక్యో నుంచి షింకషేన్ కు నడిచే రైలులో సోమవారం దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫైట్ కు సంబంధించి వీడియో క్లిప్ ట్వట్టర్ లోకి చేరింది. సుజుకి, తకాజి పోటీ పడుతుంటే చుట్టూ ఉన్న ప్రయాణికులు ఆసక్తిగా చూస్తూ, ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధించడం కనిపించింది. ఇలా అరగంట పాటు మ్యాచ్ కొనసాగింది. రెజ్లింగ్ అనేది జపాన్ లో ప్రాచుర్యం పొందిన ఆటల్లో ఒకటిగా ఉంది.
WWE match
bullet train
japan

More Telugu News