Nara Lokesh: మా అనుమానాలు బలపడుతున్నాయ్.. జైల్లో చంద్రబాబును చంపేందుకు కుట్ర జరుగుతోంది: నారా లోకేశ్

Jagan is trying to kill Chandrababu in Jail says Nara Lokesh
  • జైల్లో అంతం చేయడానికే అరెస్ట్ చేయించారన్న లోకేశ్
  • జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబుకు జైల్లో హాని తలపెట్టేలా కుట్ర చేస్తున్నారని ఆరోపణ
  • చంద్రబాబుకు ఏం జరిగినా జగన్ దే బాధ్యత అని వ్యాఖ్య
తమ అధినేత చంద్రబాబును అంతం చేసేందుకే ఆయనను అరెస్ట్ చేశారని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు. అందుకే చంద్రబాబును సైకో జగన్ అరెస్ట్ చేయించారని... జైల్లోనే అంతం చేయడానికే అరెస్ట్ చేయించారనే అనుమానాలు బలపడుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆధారాలు లేని కేసులో అరెస్ట్ చేసి, బెయిల్ రాకుండా చేసి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని అన్నారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్ష నేతకు జైల్లో హాని తలపెట్టేలా వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. 

జైల్లో భద్రత లేదు, దోమలు విపరీతంగా కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటీ వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారిన పడి మరణించాడని... చంద్రబాబుకు కూడా ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలను అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఏం జరిగినా సైకో జగన్ దే బాధ్యత అని చెప్పారు.
Nara Lokesh
Chandrababu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News