ఆదోనిలో వలంటీర్‌ను రాళ్లతో కొట్టి చంపిన దుండగులు

Volunteer Killed In Adoni Kurnool District
  • రాజీవ్‌గాంధీనగర్‌లో వలంటీర్ హరిబాబు దారుణహత్య
  • పట్టణంలో కలకలం
  • నిందితుల కోసం పోలీసుల గాలింపు
కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ వలంటీర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇక్కడ రాజీవ్‌గాంధీనగర్‌లో వలంటీర్‌ హరిబాబును దుండగులు రాళ్లతో కొట్టి చంపారు. ఈ హత్యతో పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, నిందితుల అరెస్టుతో అసలు విషయాలు బయటకు వస్తాయని పోలీసులు తెలిపారు. దర్యాప్తు ప్రారంభించినట్టు పేర్కొన్నారు.
Go Back to Shorts
Volunteer Murder
Kurnool District
Adoni

More Telugu News