China: చైనాలో టోర్నడో విధ్వంసం.. వీడియో ఇదిగో!

Large deadly tornado in Suqian Jiangsu Province
  • జియాంగ్స్ ప్రావిన్స్‌లోని సుకియాన్ పట్టణంలో ఘటన
  • 10 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
  • 137 ఇళ్లు నేలమట్టం.. నివాసాలను ఖాళీ చేసిన 400 మంది

చైనా జియాంగ్స్ ప్రావిన్స్‌లోని సుకియాన్ పట్టణంపై నిన్న మధ్యాహ్నం టోర్నడో ఒకటి విరుచుకుపడి బీభత్సం సృష్టించింది. పట్టణం మొత్తాన్ని వణికించింది. ఏం జరుగుతుందోనని జనం భయంతో వణికిపోయారు. సుడిగాలి ధాటికి ఇళ్ల పైకప్పులు అమాంతం గాల్లోకి లేచిపోయాయి. మొత్తం 137 ఇళ్లు నేలమట్టమయ్యాయి. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ టోర్నడో ధాటికి 5,500 మంది ప్రభావితం కాగా, 400 మంది నివాసాలను ఖాళీ చేసినట్టు స్థానిక మీడియా తెలిపింది. టోర్నడో విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Loading...

More Telugu News