ys bhaskar reddy: వివేకా హత్య కేసు: వైఎస్ భాస్కరరెడ్డికి ఎస్కార్ట్‌తో కూడిన బెయిల్!

  • అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన భాస్కరరెడ్డి
  • సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 3 వరకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు
  • ఎస్కార్ట్‌లో భాగంగా ఆయన వెంట ముగ్గురు పోలీసులు, ఓ వెహికిల్
YS Bhaskar Reddy gests escort bail

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కరరెడ్డికి ఎస్కార్ట్‌తో కూడిన బెయిల్ మంజూరయింది. అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు బెయిల్ ఇవ్వాలని సీబీఐ కోర్టును ఆయన ఆశ్రయించారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ న్యాయస్థానం పన్నెండు రోజుల పాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు ఆయన ఎస్కార్ బెయిల్‌పై ఉండనున్నారు.

ఎస్కార్ట్‌లో భాగంగా ఆయన వెంట ముగ్గురు పోలీసులు, ఒక పోలీస్ వెహికిల్ ఉంటాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో భాస్కరరెడ్డిని విచారించిన సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. నాటి నుంచి ఆయన చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఆయన మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా, ఎస్కార్ట్ బెయిల్ వచ్చింది.

More Telugu News