Ram Gopal Varma: టెర్రరిస్ట్‌లు పిల్లలకు ఇలాగే బ్రెయిన్ వాష్ చేస్తారు: టీడీపీ అనుకూల వీడియోను షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ

  • జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఓ విద్యార్థి వీడియోను షేర్ చేసిన వర్మ
  • దారుణమైన భాష మాట్లాడిస్తున్నారని ఆగ్రహం
  • ఇలాంటి తీరుతో పిల్లల మైండ్‌ను కలుషితం చేస్తున్నారని ఆవేదన
RGV shares videos of children who fires at ys jagan

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ వేదికగా తెలుగుదేశం పార్టీపై స్పందించారు! ఓ విద్యార్థి అధికార వైసీపీని, ముఖ్యమంత్రి జగన్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియోను వర్మ షేర్ చేశారు. చదువుకునే చిన్న పిల్లల నోటి నుంచి ఇలాంటి మాటలు ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది టీడీపీ పద్ధతిలా ఉందని, చిన్నపిల్లవాడితో ఇలాంటి దారుణమైన భాష మాట్లాడిస్తున్నారని, ఇలా మాట్లాడితే ఏ సంస్థలు ఇందుకు సంబంధించి చర్యలు చేపడతాయో కానీ, ఇలాంటి తీరు మాత్రం చిన్నపిల్లల మైండ్‌ను కలుషితం చేస్తుందన్నారు. పిల్లల మెదడును టెర్రరిస్ట్‌లా ఎలా బ్రెయిన్ వాష్ చేస్తారో ఇది వెల్లడిస్తుందన్నారు. కాగా, ఈ వీడియోలో ఓ విద్యార్థి చంద్రబాబుకు మద్దతుగా, జగన్‌పై నిప్పులు చెరిగాడు. ఏం పీకుతున్నావ్, ఒళ్లు బలిసి, జగత్ కంత్రీ అంటూ పదాలు వాడాడు. ఈ వీడియోను వర్మ షేర్ చేశారు.

More Telugu News