KTR: మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తున్నా, నా సీటు పోయినా సరే: కేటీఆర్

KTR says he welcomes women reservation bill if it means losing his seat
  • మాదాపూర్‌లో ఇంటర్నేషనల్ టెక్‌పార్క్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
  • మహిళా రిజర్వేషన్ బిల్లును సంపూర్ణంగా స్వాగతిస్తున్నట్టు వెల్లడి
  • రిజర్వేషన్‌లో భాగంగా తన సీటుపోయినా లెక్కచేయనని స్పష్టీకరణ
మహిళా రిజర్వేషన్ బిల్లును తాను సంపూర్ణంగా స్వాగతిస్తున్నానని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మాదాపూర్‌లో ఇంటర్నేషనల్ టెక్‌పార్క్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మహిళా నేతలు చాలా మంది రావాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్‌లో భాగంగా నా సీటు పోతే పోనివ్వండి. మన జీవితాలు చాలా చిన్నవి, నా పాత్ర నేను పోషించాను’’ అని కేటీఆర్ అన్నారు.
KTR
Women Reservation Bill
Parliament
BRS

More Telugu News