Rahul Gandhi: తెలంగాణ అమరుల త్యాగాలను మోదీ హేళన చేస్తూ మాట్లాడారు: రాహుల్ గాంధీ
- కొనసాగుతున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు
- నిన్న తొలిరోజున పార్లమెంటులో రాష్ట్ర విభజనపై మోదీ వ్యాఖ్యలు
- ఏపీ, తెలంగాణ విభజన సరిగా జరగలేదని వ్యాఖ్య
- మోదీ వ్యాఖ్యలను ఖండించిన రాహుల్ గాంధీ
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల తొలి రోజున ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఏపీ, తెలంగాణ విభజన సరిగా జరగలేదని మోదీ అన్నారు. తెలంగాణను రాష్ట్రంగా ప్రకటించే సమయంలో ఇరు రాష్ట్రాల్లో రక్తపాతం జరిగిందని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగినా ఎక్కడా సంతోషం అనేది లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.
మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు. మోదీ వ్యాఖ్యలు తెలంగాణను కించపరిచేలా ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ అమరులను, వారి త్యాగాలను మోదీ హేళన చేస్తూ మాట్లాడారని పేర్కొన్నారు. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరచడమేనని ధ్వజమెత్తారు.