చంద్రబాబు అరెస్ట్ వెనుక మోదీ, కేసీఆర్ ఉన్నారనే పక్కా సమాచారం ఉంది: మధు యాష్కీ
- చంద్రబాబుకు బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటున్నారన్న మధు యాష్కీ
- జగన్ గెలుపు కోసం కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేశారని ఆరోపణ
- చంద్రబాబు అరెస్ట్ పై కేసీఆర్, కేటీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపాటు
ఏపీ ఓటర్లను ఆకట్టుకోవడం కోసమే ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చంద్రబాబుకు అనుకూలంగా కల్లబొల్లి మాటలు మాట్లాడారని దుయ్యబట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆప్ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేశారని... కానీ, ఇంత వరకు కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయలేదని... ఇది బీజేపీ, బీఆర్ఎస్ కు మధ్య ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ అని అన్నారు.