YS Sharmila: ఈ బిల్లు కోసం మోదీ ప్రభుత్వం ఇంత సమయం తీసుకోవడం బాధాకరం: షర్మిల

It is very sad that Modi govt has taken lot of time for women reservation bill says YS Sharmila
  • పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుపై షర్మిల ఆనందం
  • మహిళలం సమాన హక్కును పొందేందుకు అడుగు దూరంలో ఉన్నామని వ్యాఖ్య
  • రాజకీయాలకు అతీతంగా బిల్లుకు అందరూ మద్దతు పలకాలని విన్నపం
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేందుకు సర్వం సిద్ధమయింది. మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం పలికింది. లోక్ సభలో ఈ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ ప్రవేశపెట్టారు. దీనిపై రేపు చర్చ జరగనుంది. మరోవైపు ఇది శుభపరిణామమని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. జనాభాలో సగభాగమైన మహిళలం సమానహక్కు పొందేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నామని చెప్పారు. ఇదే సమయంలో మోదీ ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు. ఈ బిల్లును ప్రవేశ పెట్టేందుకు ఇంతకాలం తీసుకోవడం బాధాకరమని చెప్పారు. ఈ బిల్లును ఎవరూ కూడా రాజకీయ అవకాశవాదంగా తీసుకోవద్దని, అదే జరిగితే బిల్లు ముఖ్య ఉద్దేశం దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ బిల్లుకు అందరం మద్దతు పలుకుదామని చెప్పారు.
YS Sharmila
YSRTP
Women Reservation Bill

More Telugu News