నారీ శక్తి బిల్లుకు భగవంతుడు నన్ను ఎంచుకున్నాడు: ప్రధాని మోదీ వ్యాఖ్య

God has chosen me to ensure womens quota says pm modi
  • మహిళా రిజర్వేషన్ బిల్లుకు నారీ శక్తి వందన్ అని పేరు పెట్టినట్లు చెప్పిన ప్రధాని
  • నారీ శక్తి బిల్లును చట్టం చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ
  • మహిళా సాధికారతపై కేవలం ఉపన్యాసాలు ఇస్తే సరిపోదని వ్యాఖ్య
మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చే భాగ్యాన్ని ఆ భగవంతుడు తనకు ఇచ్చాడని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ బిల్లుకు తాము ముందడుగు వేయబోతున్నామన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో సభ కొలువుదీరింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... మహిళా సాధికారతపై కేవలం ఉపన్యాసాలు ఇస్తే సరిపోదన్నారు.

మహిళలకు రిజర్వేషన్ ఇచ్చే బిల్లు చాలాకాలంగా పెండింగ్‌లో ఉందని గుర్తి చేశారు. కానీ ఈ రోజు ఈ బిల్లును ప్రవేశపెట్టాక ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ బిల్లుకు నారీ శక్తి వందన్ అనే పేరు పెట్టినట్లు చెప్పారు. ఈ నారీ శక్తి బిల్లును చట్టం చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. కాగా, మధ్యాహ్నం మూడు గంటలకు కొత్త పార్లమెంట్ భవనంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
Go Back to Shorts
Narendra Modi
women reservation bill
Parliament

More Telugu News